www.hyderabadcollegeevents.com
ఘనంగా ఫేర్ వెల్ డే జరుపుకున్న ప్రగతి డిగ్రీ కళాశాల
ప్రగతి మహిళా డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్ధినులు సీనియర్ విద్యార్ధులకు వీడ్కోలు పలకడానికి 3 ఫిబ్రవరి 2011న ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శ్రీ బి.వి.భద్రగిరీష్ మరియు విశిష్ట అతిథిగా 1వ ఆంధ్రా NCC బెటాలియన్ కు చెందిన G.C.I. లెఫ్టనెంట్ సరోజబాల హాజరయ్యారు. ఈ సందర్భంగా భాద్రగిరీష్ మాట్లాడుతూ విద్యార్ధినులు కృషితో అవకాశాలను అందిపుచ్చుకోవలన్నారు. ప్రతి విద్యార్ధి పర్యావరణ పరిరక్షణతో పాలుపంచు కోవాలని అప్పుడే పర్యావరణ సమతుల్యత సాధించగలమని అన్నారు. G.C.I లెఫ్టనెంట్ సరోజబాల మాట్లాడుతూ ‘విద్యార్ధినులు అన్ని రంగాలలోనూ రాణించినప్పుడే మహిళా సాధికారత సాధించగలమని అది సాధించడానికి NCC కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్ధినులకు కావలసిన అన్ని సౌకర్యాలను కళాశాల కల్పిస్తుందని కళాశాలపై డైరెక్టర్ శ్రీ రవీందర్ రావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్ మెంట్ కు చెందిన శ్రీ డా|| నాగయ్య, శ్రీ శ్రీధర్ రావు, ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ శాస్త్రి, లెక్చరల్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘ధూమ్ చాలే ధూమ్’ అంటూ విద్యార్ధినులు ప్రదర్శించిన కార్యక్రమాలు, ప్రాశ్చాత్యా సంస్కృతులకు అద్దంపట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ పెరెడ్ అందరినీ ఆకట్టుకుంది. సుమారు 50 మంది సీనియర్ విద్యార్ధినులు పాల్గొన్న ఈ కార్యక్రమం అద్భుతంగా సాగింది. కళాశాలకు చెందిన NCC విద్యార్ధినులు ప్రదర్శించిన గార్డ్ ఆఫ్ హానర్ అతిథులను ఆకట్టుకుంది.
www.hyderabadcollegeevents.com
No comments:
Post a Comment